HaromHara : కుప్పం కథతో వస్తోన్న సుధీర్ బాబు

-

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో సుధీర్ బాబు కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎస్ ఎం ఎస్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన సుధీర్బాబు ఆ తర్వాత క్రమక్రమంగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను కూడా అందుకున్నాడు. అయితే..  నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం తన తదుపరిచిత్రం హంట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు అతని కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.

కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమా టైటిల్ ను నిర్మాతలు తాజాగా ప్రకటించారు. డివైన్ టచ్ తో కూడిన పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించబడిన ఈ చిత్రానికి హరోమ్ హర:ది రివోల్ట్ అనే టైటిల్ ను పెట్టారు మేకర్స్.

ఇంటెన్స్ కాన్సెప్ట్ వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. 1989 నాటి కుప్పం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సేహారి ఫెమ్ జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news