మైలురాళ్లకు ఉండే కలర్స్‌ను ఎప్పుడైన గమనించారా..ఒక్కో రంగుకు ఒక్కో మీనింగ్‌..!

-

ట్రావెల్‌ చేస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉండే మైల్‌ స్టోన్స్‌ను చూసే ఉంటారు.. దాని పైన ఊరి పేరు, ఇంకా ఎన్ని కిలోమీటర్లు అని రాసి ఉంటుంది.. అంతవరకే అందరికి తెలుసు.. అసలు ఇవి వివిధ రంగుల్లో ఉంటాయి. అంటే రాళ్లకు రంగులేసేప్పుడు నాలుగు ఐదు రంగులు తెచ్చుకుంటారు..అలా వేసుకుంటూ వెళ్తారేమో.. అందుకే అలా రంగురంగుల్లో ఉంటాయని అనుకుంటే పొరపాటే.. అవి ఉండే రంగును బట్టి వాటి అర్థం మారిపోతుంది. అదేంటంటే..!
మైల్ స్టోన్స్ అనేవి రెండు రంగుల్లో ఉంటాయి. సగానికి పైగా తెలుపురంగు ఉంటే, పైన ఉండే పార్ట్ మాత్రం వేరే రంగులో ఉంటుంది. తెలుపు రంగు అనేది అన్ని మైల్ స్టోన్స్‌కి కామన్‌గా ఉంటుంది. కానీ తెలుపు రంగుకి కాంబినేషన్‌గా వచ్చే రంగు మాత్రమే మారుతుంది. మైల్ స్టోన్స్ మీద తెలుపుతో పాటుగా ఉండే వేరే రంగు ఆ ప్రదేశాన్ని ఇండికేట్ చేస్తుందట.

రంగురాళ్లకు అర్థాలు ఇవి..

మీరు ఉన్న ప్రదేశంలో మైల్ స్టోన్ ఎల్లో కలర్‌లో ఉంటే మీరు నేషనల్ హైవే మీద ఉన్నారు అని అర్థం.
ఒకవేళ మైల్ స్టోన్ గ్రీన్ కలర్‌లో ఉంటే మీరు స్టేట్ హైవే మీద ఉన్నారు అని అర్థం.
ఒకవేళ మైల్ స్టోన్ బ్లాక్, బ్లూ లేదా వైట్ కలర్‌లో ఉంది అంటే మీరు సిటీ లేదా డిస్ట్రిక్ట్‌లోకి ఎంటర్ అయ్యారు అని అర్థం. అంతేకాకుండా ఆ రోడ్ల మెయింటెనెన్స్ ఆ డిస్ట్రిక్ట్ పరిధిలోకి వస్తుంది లేదా ఆ రోడ్ల మెయింటెనెన్స్‌ని కేవలం ఆ సిటీ (సేమ్ సిటీ) అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది అని కూడా సంకేతమే.
ఒకవేళ మైల్ స్టోన్ రెడ్ కలర్‌లో ఉంటే మీరు రూరల్ రోడ్డులో ప్రయాణిస్తున్నారు అని అర్థం. ఈ రోడ్లు ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన కిందకి వస్తుంది..
ఇది మైల్‌ స్టోన్‌ కలర్స్‌ కాంబినేషన్‌కు మీనింగ్.. ఈసారి ఇవి చూసినప్పుడు గమనించండి.! లాంగ్‌ రైడ్‌ చేసేప్పుడు మనం వెళ్లేది..సిటీ రూరల్‌ ఏరియా అని వీటిని చూసి తెలుసుకోవచ్చు. హా ఇవన్నీ ఎందుకు..గూగుల్‌లో కొడితే అదే చెప్తుందిగా అనుకుంటారేమో.. జనరల్‌ నాలెడ్జ్ బాస్..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news