లాభాల్లో Media & Entertainment రంగాలు.. 2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లు!

-

రానున్న రోజుల్లో భారతీయ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు వేగంగా అభివృద్ధి చెందుతాయని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నివేదికను వెలువరించింది. 2026 నాటికి మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో లాభాలు రూ.4.30 లక్షల కోట్ల వరకు చేరుతాయని అంచనా వేసింది. అప్పుడు ఆ రంగంలో వార్షిక వృద్ధి రేటు 8.8 శాతంగా ఉంటుందని వెల్లడించింది. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. దీంతో ఈ రంగంలో అభివృద్ధి గణనీయంగా పెరుగుతూ వస్తోంది.

మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలు
మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలు

2026 నాటికి టీవీ ప్రకటనపై రూ.43 వేల కోట్లు ఆదాయం వస్తుందన్నారు. ప్రస్తుతం ఈ రంగంలో భారత్ కంటే అమెరికా, జపాన్, చైనా, బ్రిటన్ దేశాలు ముందంజలో ఉన్నాయి. 2022లో భారతీయ మీడియా, వినోద రంగం 11.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకోగా.. రూ.3.14 లక్షల కోట్ల టర్నోవర్‌ను ఆర్జించే అవకాశం ఉందన్నారు. ఓటీటీ రంగం కూడా రానున్న నాలుగేళ్లలో రూ.21,031 కోట్లు టర్నోవర్ కానుంది. వ్యాపారం సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సేవలకు రూ.19,973 కోట్లు, వీడియో ఆన్ డిమాండ్ సేవలకు రూ.1,058 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని పీడబ్ల్యూసీ నివేదికలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news