ఈటల రాజేందర్ సూచనలు ఆహ్వానిస్తున్నాం – KCR

-

నేడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేరును పదే పదే ప్రస్తావించారు. విశ్వవిద్యాలయాలలో డైట్ చార్జీల కోటా పెంచాలని ప్రభుత్వాన్ని ఈటెల కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఈటెల రాజేందర్ సూచనలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఈటెలది న్యాయమైన కోరిక గనుక జీవోను జారీ చేయాలని సూచించారు. ఈటల రాజేందర్ అడిగారని చేయకుండా ఉండొద్దన్నారు.

cm kcr etela rajender
cm kcr etela rajender

కావాలంటే ఈటెలను కూడా పిలిచి సలహా తీసుకోవాలని సూచించారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని, మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని అన్నారు. మా రాజేందర్ అన్న సందు దొరికితే బద్నాం చేయాలనే ఆలోచనలో ఉన్నారని అన్నారు. ఎస్సారెస్పీ నుంచి మహారాష్ట్రకు నీళ్లు ఇస్తానన్నావు అని అడుగుతున్నాడు.. దేశంలో నీటి యుద్ధాలు ఎందుకు? అని ప్రశ్నించారు. కిసాన్ సర్కార్ వస్తే తప్ప ఈ దేశం బాగుపడదన్నారు. అందుకే ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని పెట్టామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news