మీ పిల్లలకు ‘బ్యాడ్ టచ్’ పై అవగాహన కల్పించారా..లేదంటే తప్పు మీదే..!  

-

పిల్లలు సరిగా తినకపోయినా, చిరాకు పడినా..మీ పిల్లలు కచ్చితంగా మానసిక లేదా శారీరక వేధింపులకు గురైనట్లేనని సైకియాట్రిస్తులు చెబుతున్నారు. దేశంలో రోజురోజుకి చిన్నపిల్లలపై జరిగే అత్యాచారాలను చూస్తూనే ఉన్నాం. ఒకటి మరవకుముందే మరొకటి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులకు వెన్నులో వణుకు పుట్టక మానదు. ఇటీవల జరిగిన ఓ అధ్యాయంలో చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాల్లో తమ కుటుంబాలకు సంబంధించిన వారే అధికమని తేలింది. తల్లిదండ్రులు కామన్ గా..అరే మావయ్యే కదా, బాబ్భై ఏ కదా..ఇలా మనోళ్లే కదా మన పిల్లలను వారి దగ్గరకు పంపిస్తాం. కానీ వారిలో కొందరు కామాంధలు ఉంటే..అసులు మన పిల్లలకు బ్యాడ్ టచ్ అంటే ఏంటో తెలిసేలే చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పై ఉంది. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా సరే వారికి ఈ విషయంపై అవగాహన అవసరం.

బ్యాడ్‌ టచ్‌పై అవగాహన..

చిన్నపిల్లలు చాలా విషయాలు చదువు లేదా చుట్టుపక్కల విషయాలు ద్వారా తెలుసుకుంటారు.  బ్యాడ్ టచ్ పై అవగాహలో ముఖ్యం వారికి బాడీలో ప్రైవేట్ పార్ట్ గురించి చెప్పటం. ఏదైనా బొమ్మలు లేదా ఇతర కార్టూన్స్ పాత్రల ద్వారా శరీరంలో వివిధ భాగాలను చూపించి పిల్లలకు అ‌వగాహన కల్పించాలి. తద్వారా ఏ భాగాలు తాకకూడదో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. చిన్నపిల్లలు వారిపై జరిగే అకృత్యాలను తెలుసుకోలేరు.. ఇలా చెప్పటం వల్ల తాకకూడని భాగాలను ఎ‌వరైనా తాకినప్పుడు పిల్లలు వెంటనే ప్రతిఘటించటం చేస్తారు.

పిల్లలతో స్నేహంగా ఉండాలి..

పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా ఉండాలి. బొమ్మరిల్లు ఫాదర్ లా ఉంటే..వాళ్లు మనకు ఏం చెప్పరు  చాలా సందర్భాల్లో పిల్లలు తమ తల్లిదండ్రులతో ఏ విషయాలు పంచుకోరు. ఎందుకంటే చెప్తే..పేరెంట్స్ ఏమైనా అంటారేమో అని భయం.  ఈ భయం నేరస్థులకు పిల్లలపై దాడులు చేయడానికి మరింత ప్రొత్సాహం ఇస్తుంది. కాబట్టి తల్గిదండ్రులు ముందుగానే..పిల్లలకు ఏమి జరిగినా సరే..మీ శరీర భద్రత లేదా శరీర ప్రైవేటు పార్టులకు ఏదైనా సమస్య వస్తే దాని గురించి వెంటనే చెప్పాలి అని నేర్పించాల్సి ఉంటుంది.  తల్లిదండ్రులతో పంచుకోవటం తప్పు కాదని మీరు చెప్పాలి.

పిల్లలపై అనవసరంగా కోప్పడకూడదు..

కొన్నిసార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఏవైనా సంఘటనలు పంచుకున్నపుడు మీరేదో వర్క్ టెన్షన్ లో ఉండో మరేదో పనిలో ఉండో.. వారిని తిడతారు. అలా చేయకూడదు. అది మంచిది కాదు. ఇది మీ పిల్లల జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడికి లోనవుతారు.

పేరెంట్స్ గా మీరేం చేయాలి..?

1. మీ పిల్లలను కారణం లేకుండా తిట్టకూడదు.
2. వారు ఏదైనా చెప్పడానికి వస్తే.. ఆపే ప్రయత్నం చేయకండి.
3. ఎప్పుడైనా.. ముభావంగా ఉంటే.. మాట్లడమని పదేపదే విసగించకూడదు
4. ఏం జరిగిందో మరచిపోమని అనకూడదు. తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలి.
5. మీ పిల్లలపై సానుభూతిగా ఉండే ప్రయత్నం చేయండి.
మన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వీటితో పాటు స్కూల్ కి వెళ్లే వయసున్న పిల్లలకు కూడా ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి మీ నానమ్మకు బాలేదో, లేదా మావయ్యకు బాలేదు. నాన్నకు యాక్సిడెంట్ అయింది, మరేదో లాంటి కారణాలు చెప్పి మీ పిల్లలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటివాటి గురించి కూడా మీరు ముందుగానే పిల్లలకు చెప్పాలి.. మేము తప్పా మరెవరు వచ్చి మా పేర్లు చెప్పినా వాళ్లతో వెళ్లకూడదనో లేదా వారికి గుర్తుండేలా ఏదైనా కోడ్ వోర్డ్ చెప్పటం..వచ్చిన వ్యక్తి ఆ కోడ్ చెప్పకుంటే వాళ్లతో అస్సలు వెళ్లకూడదని బలంగా చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version