చనిపోయిన వాళ్ళు మీ కలలో కనపడ్డారా..? ఏం అవుతుందంటే..?

-

మనకి ఒక్కొక్క సారి కలలో కొన్ని విచిత్రమైనవి కనబడుతూ ఉంటాయి. అయితే సాధారణంగా కల లో మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో అవే వస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్క సారి భయంకరమైన పీడ కలలు రావడం.. దయ్యాలు భూతాలు వంటివి కనపడడం జరుగుతూ ఉంటాయి. లేదంటే మనల్ని పాము తరమడం వంటివి కూడా మనకి కలలో కనబడుతూ ఉంటాయి.

ఒక్కొక్క సారి చనిపోయిన వారు కూడా మనకి కల లో కనపడుతూ ఉంటారు. అయితే చనిపోయిన వారు కలలో కనపడడం మంచిదా కాదా..? చనిపోయిన వాళ్లు కలలో కనపడితే ఏమవుతుంది అనేది చూద్దాం. కలలో కనుక చనిపోయిన మీ తల్లి కనబడితే ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలట. అదే ఒకవేళ మీ తండ్రి చనిపోయి మీ కలలోకి వచ్చి ఉంటే దుష్టశక్తుల నుంచి అపకీర్తిని ఎదుర్కొంటారని దానికి సంకేతం అలానే మీ శత్రువుల నుండి కూడా జాగ్రత్తగా ఉండాలట.

చనిపోయిన మీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ కల లో కనపడితే ప్రముఖులతో మీ బంధం మరింత దృఢంగా మారుతుందని దాని వెనుక సంకేతం. స్నేహితులు బంధువులు తెలిసిన వ్యక్తులు కనుక చనిపోయి కలలో కనపడితే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దానికి అర్థం.

Read more RELATED
Recommended to you

Latest news