జగనన్నా సంక్షేమం కంటే ముందు ఇవి చూడన్నా…!

-

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల అమలు అనేది ఇప్పుడు ఒక సవాల్ అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. సిఎం జగన్ ఆదాయం పెంచకుండా అప్పులు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ప్రజల్లో ఓటు బ్యాంకు పెరగవచ్చు గాని, అప్పులు చేసి ఇస్తున్నారు అని తటస్థులు ఆలోచించడం మొదలు పెడితే అనవసరంగా జగన్ నష్టపోయే అవకాశాలు ఉంటాయి అనే విషయం స్పష్టంగా చెప్పేయొచ్చు. జగన్ ఆలొచనలు అన్నీ కూడా క్షేత్ర స్థాయి ఓటు బ్యాంకు మీదనే ఉన్నాయి.

ఆ ఓటు బ్యాంకు ని కాపాడుకుంటూ జగన్ పాలన చేసుకోవాల్సి ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా సరే ఆ ఓటు బ్యాంకు ని ఆయన కాపాడుకోవాలి. సాధారణంగా జనం ఆలోచన ఎలా ఉంటుంది అంటే… ఈ పూట పెట్టి మధ్యాహ్నం పెట్టలేదు అంటే, మరొకరు పెడితే వారు దేవుడు అంటారు. వందలో 90 మంది ఇదే ఆలోచనలో ఉంటారు. కాబట్టి జగన్ ఆదాయం పెంచుకోవాలి. ఈ ఏడాది ఇచ్చి వచ్చే ఏడాది ఇవ్వలేదు అంటే… ఇవ్వలేదనే అంటారు. సంక్షేమ కార్యక్రమాలను అప్పులతో అమలు చేస్తే ఆర్ధిక సంక్షోభం పెరుగుతుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయే అవకాశం ఉంటుంది.

క్రమంగా వడ్డీలు కట్టడానికి ధరలు పెంచుతారు కాబట్టి వంద రూపాయలు వాడే వాడు పది రూపాయలు కూడా ఆలోచించి వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుల విషయంలో సిఎం జగన్ ఆలోచన మార్చాలి. ఈ ఆర్ధిక ఏడాదిలో వడ్డీలే నాలుగు వేల కోట్లు కట్టింది ఏపీ సర్కార్. కాబట్టి అప్పుల విషయంలో… ఆదాయం పెంచుకుంటే రాబోయే రోజులలో ఏ ఇబ్బంది రాకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవచ్చు. లేదంటే రిజర్వ్ బ్యాంకు కి కేంద్రానికి లేఖలు రాసి జీతాల కోసం అడుక్కునే పరిస్థితి ఉండవచ్చు.

ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ ఆస్తులు పెంచాలి… అలాగే రాయితీలు ఇవ్వడం ద్వారా చిన్న చిన్న పరిశ్రమల నుంచి ప్రముఖ కంపెనీల వరకు ఆకర్షించాలి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఆదాయం సమకూరాలి అంటే, మద్యపాన నిషేధం విషయంలో వెనక్కు తగ్గాలి. మద్యంపై వచ్చే ఆదాయమే ఇప్పుడు కేంద్రాలకు రాష్ట్రాలకు అండగా నిలబడింది. అందుకే బార్లు, వైన్స్ ఓపెన్ చేసారు. మద్యపాన నిషేధం పేరుతో ఏపీలో ధరలు పెంచడంతో నాటు సరా తాగుతున్నారు గాని ప్రభుత్వ మద్యం ఎవరూ కొనడం లేదు. కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించి అడుగులు వేసి ఆదాయం పెంచుకోవాలి. అప్పుల విషయంలో వెనక్కు తగ్గలేదు అంటే మాత్రం భవిష్యత్తులో ఆ ఒత్తిడి పడేది ప్రజల మీదనే.

Read more RELATED
Recommended to you

Latest news