యాదాద్రి-భువనగిరి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించిన అనంతరం కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఎవరి చావు వారు చావండి అన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ పరిస్థితి ఉందని ఆయన ఆరోపించారు. కరోనా మరణాలన్నీ కేసీఆర్ హత్యలే… రాష్ట్రంలో కరోనా విజృంభణకు కేసీఆర్ అనుచిత నిర్ణయాలే కారణమని ఆయన ఆరోపణలు చేసారు.
వైద్య ఆరోగ్య శాఖ ఖాళీలపై ఎప్పుడైనా ముఖ్యమంత్రి రివ్యూ చేశారా అని నిలదీశారు. యజ్ఞ, యాగాలు, ఫామ్ హౌజ్ లో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు దేవుడు లేని దేవాలయాలుగా మారాయన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లెక్కలతో సహా ప్రభుత్వాన్ని నిలదిస్తామని, రాష్ట్రంలో ప్రేవేటు ఆసుపత్రులను పెంచి పోషిస్తుంది ప్రభుత్వమే అని ఆరోపించారు. మూడు లక్షల కోట్ల అప్పు తెచ్చిన ముఖ్యమంత్రి పది వేల కోట్ల ఖర్చు చేసినా పేద ప్రజల ఆరోగ్యం బాగుండేదన్నారు ఆయన.