హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం థాయ్ లాండ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన విద్యార్థినిపై.. హెచ్ సీయూ ప్రొఫెసర్ రవిరంజన్ అత్యాచార యత్నం చేశాడు. అయితే భయపడిపోయిన బాధితురాలు ప్రొఫెసర్ బారి నుంచి తప్పించుకుంది. అనంతరం గచ్చిబౌలి పోలీస్ స్టెషన్ కు చేరుకొని… పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యూనివర్సిటీ విద్యార్థులు…ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రొఫెసర్ రవిరంజన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు విద్యార్థినులను భయపెట్టేలా ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అంత పెద్ద యూనివర్సిటీలో విద్యార్థినులకు భద్రత లేకపోవడం ఆందోళన కల్గించే విషయమే. ఇదిలా ఉంటే.. ప్రొఫెసర్ రవిరంజన్(62)ను సైబరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
సదరు ప్రొఫెసర్ హిందీ సబ్జెక్ట్ బోధిస్తున్నట్లు తెలిసింది. తదుపరి విచారణ కొనసాగుతోంది. అయితే.. ప్రొఫెసర్ రవిరంజన్ ఎలాంటి వారని పోలీసులు ఆరా తీస్తున్నారు. నిజంగా ఆయన అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ చాలా మందికి.. అంత పెద్ద స్థాయిలో ఉన్న ప్రొఫెసర్ పై పోలీసులు నిజంగానే చర్యలు తీసుకుంటారా అనే అనుమానాలు వస్తున్నాయి.