లక్కీ ఫెల్లో: కల గన్నాడు.. రూ.2 కోట్ల లాటరీ గెలిచాడు..

-

సాధారణంగా ప్రతిఒక్కరికీ కలలు వస్తుంటాయి. కొందరికీ సంతోషాన్ని ఇచ్చే కలలు వస్తే.. మరికొందరికీ భయాన్ని కలిగించే కలలు వస్తుంటాయి. అయితే ఓ వ్యక్తికి వచ్చిన కల తన జీవితాన్నే మార్చేసింది. యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తి కన్న కల సాకారమైంది. రెండు డాలర్లకు టికెట్ కొనుగోలు చేశాడు. దీంతో రూ.2 కోట్లు గెలుచుకున్నాడు. వర్జీనియాలోని హెన్రీకో కౌంటీకి చెందిన అలోంజో కోల్‌మాన్ రిటైర్డ్ ఉద్యోగి.

లాటరీ
లాటరీ

ఇటీవల అతను 13-14-15-16-17-18-19 నంబర్ల లాటరీ కొన్నాడు. మరుసటి రోజు అతడికి లాటరీ గెలిచినట్లు కల వచ్చింది. ఆ కలే నిజమైనట్లు అలోంజో తెలిపాడు. గ్రేటర్ రిచ్‌మండ్ రీజియన్‌లోని తన స్వస్థలమైన కార్నర్ మార్ట్ నుంచి నంబర్లతోనే ఉన్న లాటరీ టికెట్‌ను కొన్నాడు. డ్రా తేదీ జూన్ 11 కావడంతో అప్పటివరకు ఎదురు చూశాడు. దాదాపు రెండు కోట్లు గెలుచుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news