నటి ఇంద్రజను హీరోయిన్ గా ఎదగకుండా చేసింది అతడేనా..?

-

స్టార్ నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో , అభినయంతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ మొదటిసారి తమిళ్ ఛానల్లో జయ టీవీలో శాస్త్రీయ నృత్యం ఆధారంగా తెరకెక్కిన గేమ్ షో తకధిమిత షో కి 2005లో యాంకర్ గా పనిచేసింది. మళ్ళీ టీవీ సీరియల్స్ లో నటించింది . ఇక సుందరకాండ అనే తెలుగు సీరియల్ లో ప్రతినాయక పాత్రను పోషించిన ఈమె భైరవి అనే తమిళ సీరియల్ లో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సన్ టీవీ సీరియల్ వల్లిలో కూడా తమిళ్లో నటిస్తోంది ఇంద్రజ. ఇకపోతే వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల యొక్క కాల్ షీట్లను మేనేజ్ చేయడంతో పాటు వారికి అవకాశాలు తీసుకురావడంలో వారి పర్సనల్ మేనేజర్లు రోల్ ప్లే చేస్తూ ఉంటారు.

అందుకే ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన చాలామంది అనుభవంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ పరిచయాలు ఉన్న వారిని తమ పర్సనల్ మేనేజర్లుగా అపాయింట్ చేసుకుంటూ ఉండడం గమనార్హం. కానీ ఈ విషయంలోనే ఇంద్రజ తప్పటడుగు వేసింది. అంతేకాదు ఒకానొక సమయంలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా అంగీకరించడం జరిగింది. ఇకపోతే తనకు వచ్చే అవకాశాలను హ్యాండిల్ చేయడం మినహాయిస్తే తనకు కొత్త అవకాశాలు తీసుకురావడంలో తన మేనేజర్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఇంద్రజకు చాలా ఆలస్యంగా అర్ధమైందట.

అంతేకాదు కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్స్ లో చేసేందుకు ఆమెను ఒప్పించడం కూడా ఆమె హీరోయిన్ అవకాశాలకు దెబ్బతీసింది. ప్రస్తుతం ఇదే విషయాన్ని అతడి దగ్గర ప్రస్తావిస్తే మీకు అలాంటి ఆఫర్లే వస్తున్నాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయే వారట ఆ మేనేజర్. ఇక అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది.ఇక ఆ మేనేజర్ వల్లే ఇంద్రజ హీరోయిన్ అయ్యే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయింది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news