తన భార్య అనుకొని మరో వ్యక్తి భార్యను బైక్ పై ఎక్కించుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే?

-

తన భార్య అనుకొని మరో వ్యక్తి భార్యను బైక్ పై ఎక్కించుకొని కొంత దూరం వెళ్లిన తర్వాత అసలు విషయం తెలుసుకుని నాలుక కరుచుకున్నాడు ఓ వ్యక్తి. కర్ణాటకలోని హవేరి జిల్లా రాణేబెన్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భార్యాభర్తలు రోడ్డుపై వెళుతుండగా భర్త పెట్రోల్ పోయించుకునేందుకు బంక్ దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో బైక్ దిగిన తన భార్య కాస్త ముందుకెళ్లి నిల్చుంది.

పెట్రోల్ పోయించుకొని తన భార్య లాంటి చేరే కట్టుకున్న మరో మహిళ దగ్గరికి వెళ్లి బండి ఆపి ఎక్కమని అన్నాడు. అతను కూడా అచ్చం అలాంటి బైక్, అదే తెల్ల రంగు చొక్కా తో ఉండడంతో ఆమె కూడా పొరపాటు పడింది. అలా బైక్ ఎక్కి వెళుతుండగా.. ” ఏవండీ మన ఇల్లు ఇటు కాదు కదా? ఇటువైపు ఎందుకు తీసుకు వెళుతున్నారు” అని ప్రశ్నించింది. ఇలా ఎందుకు మాట్లాడుతుందని అతను వెనక్కి తిరిగి చూసి వెనకున్న ఆవిడ తన భార్య కాదని తెలుసుకొని నాలుక కరుచుకున్నాడు.

జరిగిన పొరపాటు అర్ధమైన ఐదు నిమిషాలలోనే ఆయన తిరిగి ఆమెను పెట్రోలు బంకు దగ్గరికి తీసుకు వచ్చాడు. అప్పటికే ఈయన భార్య, ఆమె భర్త అక్కడ వేచి చూస్తున్నారు. ఇద్దరి బైక్ లు, అలాగే ధరించిన చొక్కాలు, అలాగే వీరిద్దరి చీరలు కూడా ఒకే రంగులో ఉండడంతో ఈ పొరపాటు జరిగిందని తెలుసుకొని వారితోపాటు, బంకులో ఉన్న వారు కూడా ఈ విషయం తెలుసుకొని కడుపుబ్బ నవ్వుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version