సైకిలింగ్‌ చెయ్యండి.. అందరితో మింగిల్‌ అవ్వండి!

-

ట్రింగ్‌.. ట్రింగ్‌.. మంటూ పదుల కిలోమీటర్లు తొక్కి మరీ స్కూల్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు అది ఒక టైంపాస్‌, లేదా ఇంట్లో అలంకరణగా మారిపోయింది. చిన్నారులు తప్ప మరెవ్వరూ వీటిని ముట్టుకోవడం లేదు. ఆరోగ్యాన్నిచ్చే వాహనాలను ఇంటి ప్రహరి గోడ బయట పెట్టి, అనారోగ్యాన్ని కలిగించే కార్లు, బైకులను మాత్రం మంచుపడకుండా షెల్టర్‌ కల్పిస్తున్నారు. అందుకేనేమో చేసుకున్నవారిక చేసుకున్నంతా అన్న సామెత వచ్చింది. సైకిల్‌ను బయట పెట్టినప్పటి నుంచి హాస్పిటల్స్‌ కార్లో హాస్పిటల్స్‌ చుట్టూ తిరగడం ఎక్కువైంది అంటున్నారు వైద్య నిపుణులు.. ఎందుకో తెలుసా?

అప్పట్లో సైకిల్‌ అదొక అవసరం. నిత్యం కొంతదూరం వెళ్లాలంటే అందుకు సైకిల్‌ను తప్పనిసరిగా వాడేవారు. వాస్తవానికి ఇది బౌతిక వ్యాయామంలో సైకిల్‌ తొక్కడం, పరిగెత్తుడం రెండూ అద్భుతమైనవే.. ఈ రెండు కూడా భౌతికంగా మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. సైకిల్‌ తొక్కడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలోని కేలరీలు ఖర్చు చేసి కొవ్వు నిల్వలు కరిగిస్తుంది. వేగంగా సైకిల్‌ తొక్కుతూ ఉంటే అసలు బరువు పెరుగుతారన్న విషయమే మీకు తెలియదు.

సైకిల్‌ తొక్కడం వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది. అడ్రినలిన్‌, ఎండార్ఫిన్స్‌ విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది. సైకిల్‌ తొక్కితే అది మీ శారీరక కండరాలను బలపరచి మంచి శక్తి కలిగిస్తుంది. రోజూ సైకిల్‌ తొక్కడం బ్రెయిన్‌ పవర్‌ను పెంచుతుంది. రోజూ సైకిల్‌ తొక్కే పిల్లల్లో మెదడు చురుకవుతుంది. సైకిలింగ్‌ చేసేటప్పుడు మీరు అధికంగా గాలి తీసుకోవడం, వదలడం వంటివి చేస్తారు. గట్టిగా శ్వాస తీయడం, వదలడం మీలోని మలినాలను విసర్జిస్తుంది. వేగంగా సైకిల్‌ తొక్కితే అది మీ శ్వాసను పెంచి గుండెను రక్షిస్తుంది.

సైకిల్‌ తొక్కడం వల్ల వందశాతం ప్రయోజనాలే తప్ప ఎటువంటి అపకారం ఉండదు. కనీసం రోజుకు 20 నిమిషాలు సైకిల్‌ తొక్కడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ కొంత దూరం సైకిల్‌ తొక్కాలంటే మీలోని డిప్రెషన్‌ను దూరం చేస్తుంది. అదేవిధంగా సైకిల్‌ తొక్కడం వల్ల కాళ్లు, కీళ్లనొప్పులు, షుగర్‌ వ్యాధి గ్రస్తులకు, హృదయ కండరాలకు బలం చేకూరుతుంది. అన్నీ రకాల క్యాన్సర్‌ల నివారణ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news