అబ్బో మహేష్ 27 మూవీ టైటిల్ అదా……??

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండేళ్ల క్రితం భరత్ అనే నేను, గత ఏడాది మహర్షి తో రెండు విజయాలు అందుకున్న సూపర్ స్టార్, ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ సినిమా సక్సెస్ కావడంతో ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో టూర్ లో ఉన్న మహేష్, మరొక నెలలో ఇండియాకి తిరిగి రానున్నారు.

అయితే మహర్షి స్టైల్ లో కాకుండా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు, తొలిసారిగా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నట్లు చెప్తున్నారు. అయితే అందులో ఒక పాత్ర మంచి క్లాస్ కాగా, మరొక పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండనుందని అంటున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమాను మహేష్, దిల్ రాజు కలిసి ఎంతో గ్రాండ్ లెవెల్ లో నిర్మించనున్నారట.

 

ఇక ఈ సినిమాకు కాళీ అనే టైటిల్ అనుకుంటున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. రజినీకాంత్ నటించిన బాషా రేంజ్ లో ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఉండనుందని సమాచారం. మరి ఈ సినిమా విషయమై ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ వార్తే అని చెప్పవచ్చు… !!

Read more RELATED
Recommended to you

Latest news