అదంతా ఫేక్‌… వ్యాక్సినేషన్‌ పై తెలంగాణ ఆరోగ్య శాఖ క్లారిటీ

-

ఇవాళ ఉదయం నుంచి ఒకే వార్త సోషల్‌ మీడియా తో పాటు కొన్ని మీడియా చానెళ్లలో ప్రసారం అవుతోంది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకోక పోతే… రేషన్‌ మరియు పింఛన్‌ కట్‌ చేసేందుకు తెలంగాణ సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రసారమవుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా… ఆందోళన కు లోనయ్యారు.

అయితే.. ఈ వార్తలపై స్వయంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకోని వారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పు అని ప్రజా వైద్యరోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ఆందోళనకు గురికావద్దని కోరారు. తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా వ్యాక్సినేషనల్‌ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version