రాగులతో అందమైన ఆరోగ్యం మీ సొంతం.. డయాబెటీస్ నుంచి బీపీ వరకూ అన్నింటికి చెక్..!

-

సిరిధాన్యల వల్ల మన ఆరోగ్యానికి చాలారకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. మన పూర్వీకులు ఇవి తినే అంత బలంగా ఉండేవాళ్లని మన పెద్దోళ్లు చెబుతుంటారు. ఆ సిరిధాన్యాలలో కూడా రాగులు చాలా ముఖ్యమైని. రాగి జావ గురించి మనందిరికి తెలిసే ఉంటుంది. అయితే రాగులతో కలిగే మరన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాగులు ఆకలి తగ్గిస్తుంది. మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది . అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది.

అంతేకాదు రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు ఇవి సహాయపడతాయి. రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి ఎంతగానో తోడ్పడుతుంది.

రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావట. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. దాంతో డయాబెటీస్ పేషెంట్స్ కి చక్కరస్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.

రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ కలిగి ఉండటంతో కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది.

రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. వారిలో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. ఎదిగే పిల్లలకు రాగి జావ తాగిస్తే చాలా మంచిది. అవయవాల్లో లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు. వారిలో స్థూలకాయం రాకుండా ఉంటుంది.

గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.

హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారికి రాగులు బాగా సహాయపడుతాయి. రోస్ట్ చేసిన రాగులను తీసుకోవడం ఒక టానిక్ లా అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

ఇలా మీ చర్మం ఆరోగ్యానికి, శరీరానికి రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏదోవిధగంగా రాగులను మీ డైట్ లో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు. వీటి ధర కూడా ఎక్కువగా ఏం ఉండదు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news