సిద్దిపేట కలెక్టర్, ప్రభుత్వంపై హై కోర్ట్ లో పిటీషన్..

-

వరి వేెయొద్దని సిద్దిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ ఉదంతంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు కలెక్టర్ తో పాటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ప్రభుత్వంపై పిటీషన్ దాఖలైంది. బాతుల నారాయణ అనే రైతు హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. యాసంగిలో వరి వేయద్దని, విత్తనాలు అమ్మవద్దని హెచ్చిరించిన కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో కోరారు. గతంలో ప్రాజెక్ట్ లు నిర్మించింది వరిసాగు కోసమే అని చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం వరి వేస్తే ఉరే అని బెదిరిస్తున్నారని కోర్ట్ కు విన్నవించారు. సుప్రీం కోర్ట్, హై కోర్ట్ ఆర్డర్లు ఇచ్చినా పట్టించుకోమని కోర్ట్ కు తెలిపారు పిటీషనర్. వరి సాగు చేయద్దని బెదిరించడం చట్ట విరుద్దమని పిటీషనర్ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం వ్యవసాయ శాఖ అధికారులు, విత్తనాల షాపుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాసంగిలో వరి వేయద్దని, వరి సీడ్ అమ్మితే షాపులు సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చిరించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయం దుమారం రేగుతోంది. ప్రస్తుతం ఈ అంశం హై కోర్ట్ కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news