మరోసారి ఆత్మహత్యాయత్నం చేసిన మిస్ తెలంగాణ..!

-

2 రోజుల క్రితం హైదరాబాద్ లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ మిస్ తెలంగాణ భవాని మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో ఉన్న మునేటి వంతెన పై నుండి శుక్రవారం నది నీటిలో దూకింది. అయితే అక్కడే ఉన్న స్థానికులు గమనించడంతో వెంటనే ఆమెను ప్రాణాలతో రక్షించారు. వీరులపాడు మండలం బోడవాడ కు చెందిన కలక భవాని అలియాస్ హాసిని హైదరాబాద్ హిమాయత్ నగర్ లో నివాసం ఉంటూ మోడలింగ్ చేస్తోంది.

శుక్రవారం సాయంత్రం బయటికి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన భవాని కీసర వంతెన పై వాహనాన్ని నిలిపి ఒక్కసారిగా నదిలోకి దూకింది. స్థానికులు రక్షించి ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే భవాని ఇటీవలే తనను ఓ యువకుడు వేధింపులకు గురి చేస్తున్నట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news