తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9 గంటల వ్యవధిలో నిర్మల్ జిల్లా ముత్తోలు రికార్డు స్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఐదేళ్లలో జూలై నెల ఒకరోజు అంటే 24 గంటల్లో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే.
ఇంతకుముందు ఒకరోజు అత్యధికంగా వర్షపాతం 2013 సంవత్సరంలో రామగుండంలో నమోదయింది. రికార్డు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మరియు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా తెలంగాణ జిల్లాలు ఆయన నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సూర్యాపేట,జగిత్యాల, వరంగల్ తదితర జిల్లాలో భారీ నుంచి అది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు హైదరాబాద్ లోను…. వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రెడ్ అలెర్ట్ జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర అధికారులు. అత్యవసరం అయితే తప్పితే… బయటకు రావద్దని హెచ్చరించారు.