ఫ్యాన్ ఒంటిపై టాటూలు చూసి షాకైన నాగచైతన్య

-

ఫ్యాన్స్, ఫ్యాన్ గ్రూప్స్, ఆర్మీస్.. ఇలా పేరేదైనా తమ అభిమాన నటులను సపోర్ట్ చేసే విధానం ఒకటే. అభిమానం పేరుతో తమ ఫేవరెట్ యాక్టర్ల కోసం కొందరు ఫ్యాన్స్ చేసే పనులు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అలా టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా తన కోసం ఓ అభిమాని చేసిన పని చూసి షాకయ్యారు.

తనని చూడటానికి విజయనగరం నుంచి వచ్చిన ఓ అభిమానితో నాగచైతన్య కాసేపు ముచ్చటించారు. అతడి ఒంటిపైన నాగచైతన్య చిత్రం, పేరు, సినిమా పేర్లతో ఉన్న టాటూలు చూసి ఆశ్చర్యపోయారు. ఇంత అభిమానమేంటని సంతోషం వ్యక్తం చేశారు. తనని ఇంతలా ప్రేమిస్తున్నందుకు ఆ ఫ్యాన్ కి థ్యాంక్యూ చెప్పారు.

విజయనగరానికి చెందిన ఓ నాగచైతన్య అభిమాని చై ని కలవడానికి హైదరాబాద్ వచ్చాడు. థ్యాంక్యూ సినిమా విజయోత్సవంలో ఉన్న నాగచైతన్య ఆ అభిమానిని కలిశాడు. అతడి గురించి వివరాలు అడిగాడు. కాసేపు ముచ్చటించాడు. అతడు విజయనగరంలో డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నాడని తెలుసుకున్నాడు. ఏదైనా సినిమాకి డ్యాన్స్ కంపోజ్ చేశావా అని అభిమానని చై అడిగాడు. ఇంకా లేదని.. ఓ రియాల్టీ షోలో మాత్రం పాల్గొన్నానని అతడు చెప్పగా.. బాగా కష్టపడమని.. త్వరలోనే సినిమాలో ఛాన్స్ వస్తుందని భరోసానిచ్చాడు చై.

కాసేపు తన ఫ్యాన్ తో ముచ్చటించిన చై.. చివరలో అతడితో కలిసి ఫొటోలు దిగాడు. తనపై ఇంతలా అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్యూ చెప్పాడు. ఇంత ప్రేమను తానెప్పుడూ గుర్తుపెట్టుకుంటానని చెప్పాడు. ఎల్లప్పుడూ తనని ఇలాగే సపోర్ట్ చేయాలని చై కోరాడు. ఇంకా మంచి మంచి సినిమాలు చేసి తన ఫ్యాన్స్ ని అలరిస్తానని అన్నాడు. చై తన అభిమానితో ముచ్చటించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. చై చాలా సింపుల్ మ్యాన్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. వ్వావ్.. చై మేం కూడా నీకు ఫ్యాన్స్ .. మాకెప్పుడు నీ దర్శనం అంటూ అడుగుతున్నారు. ఇటీవలే థ్యాంక్యూ సినిమాతో నాగచైతన్య సందడి చేశాడు. లాల్ సింగ్ చద్దా మూవీతో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news