హీరో నాని సంచలన నిర్ణయం!

టాలీవుడ్ స్టార్ హీరో నాని ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పై ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని.. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటుందని చురకలు అంటించారు.

ఇప్పుడు ఏదీ మాట్లాడినా వివాదం అవుతుందని.. టికెట్ ధరలు పెంచినా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేసిన హీరో నాని.. ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. తన పేరు ముందు నేచురల్ స్టార్ తీసేద్దామనుకుంటున్నానని ప్రకటించారు. ఇక తనను నేచురల్ స్టార్ అని ఎవరు పిలవద్దని పేర్కొన్నారు. ప్రేక్షకులకు సినిమా చూపించడమే తమ లక్ష్యమని, లెక్కలు తర్వాత చూసుకుందామని నాని వెల్లడించారు. ఇక నాని.. ఏపీ ప్రభుత్వంపై  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమరాన్నే రేపుతున్నాయి.