పంజాబ్ లో బాంబ్ బ్లాస్ట్… లూథియానా కోర్ట్ లో భారీ పేలుడు, ఇద్దరి మరణం

-

పంజాబ్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. బాంబ్ పేలుడుతో ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉన్న పంజాబ్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పంజాబ్‌లోని లూథియానాలోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన బాంబ్ పేలుడు సంభవించింది. ఇందులో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. దాదాపు 5 మంది వరకు గాయాలపాలయ్యారని తెలుస్తోంది. కోర్టు కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులోని వాష్‌రూమ్‌లో పేలుడు సంభవించింది. లూథియానాలో జరిగిన ఘటన బాంబు పేలుడు వల్ల జరిగిందా లేదా ప్రమాదమా లేదా ఏదైనా ఉగ్రవాద కుట్రా.. అన్నది ఇంకా తెలియలేదు.

ఇటీవల పంజాబ్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇటీవల స్వర్ణదేవాలయంలో గురుగ్రంథ సాహిబ్ ను ఓ ఆగంతకుడు అపవిత్రం చేయడంతో.. అతన్ని పట్టుకుని సిక్కులు దాడి చేయడంతో మరణించాడు. ఈ దాడి తరహాలోనే కపుర్తలాలోని గురుద్వారాలో ఓ ఆగంతకుడు ఇలానే చేశాడు. స్థానికుల దాడిలో అతడు కూడా మరణించాడు. దీంతో పంజాబ్ అంతటా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పంజాబ్ ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. దీనిపై సిట్ కూడా ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news