ఆయన మాట వినడానికి.. నేను చంద్రబాబు పీఏను కాదు : అశోక్ గజపతి

రామతీర్థం వివాదంలో చంద్రబాబును లాగుతున్నారు…నేను చంద్రబాబు చెప్పినట్టు చేయడానికి నేనేమైనా ఆయన పీఏనా అని మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై ఆలయ ఈవో కేసు పెట్టడంపై అశోక్ గజపతి మీడియా తో మాట్లాడారు. ఈవోలతో కేసులు పెట్టించడం కొత్త అలవాటుగా మారిందని.. దేవాదాయశాఖలో ఆచార సాంప్రదాయాలు తప్ప ప్రోటోకాల్ అనే పదం ఉండదని.. అరెస్టులు, కేసులు, బెదిరింపులు నాకు కొత్త కాదు….హిందూ ధర్మకోసం ఊపిరి ఆగేవరకు పోరాడతానని స్పష్టం చేశారు.

దేవాలయాలకు దేవుడే ఓనర్…గర్భగుడి దగ్గర శిలాఫలకాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. విధులకు ఆటంకం కలిగించామని కేసులు పెట్టడం కొత్త సంప్రదాయమని.. కేసులకు నేను భయపడను…. హిందూ మతంను కాపాడడానికి శక్తి వంచన లేకుండా చేస్తానని ప్రకటన చేశారు. మంత్రులు ఆలోచనలు, భాష గురించి నేను స్పందించలేనని.. నా కుటుంబం దేశద్రోహులు కుటుంబం అని జిల్లా మంత్రి అన్నారని ఫైర్ అయ్యారు. నిన్న మా తల్లిదండ్రులు పెంపకం గురించి మాట్లాడారని బొత్స పై ఫైర్ అయ్యారు. అనువంశిక ధర్మకర్తలను ప్రభుత్వాలు నియమించవు….సాంప్రదాయాల ప్రకారం అనువంశికంగా వస్తాయని చురకలు అంటించారు.