డ్రగ్స్ కేసు: నేడు ఈడీ ముందుకు నవదీప్

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతుంది. నాలుగేళ్ళ క్రితం వెలుగులోకి వచ్చిన కేసు, ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈడీ ఈ కేసును విచారిస్తుంది. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ కోణంలో విచారణకు నోటీసులు పంపిస్తున్నారు. టాలీవుడ్ సెలెబ్రిటీలైన పూరి జగన్నాథ్, ఛార్మి, మొదలగు వారిని ఇప్పటికే విచారించారు. తాజాగా ఈడీ ముందుకు హీరో నవదీప్ హాజరు కానున్నారు. నేడు ఈడీ ఎదుట హీరో నవదీప్ హాజరు అవుతున్నారు.

డ్రగ్స్ కేసులో కెల్విన్ తో సంబంధాలపై ఆరా తీయనున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ కేసు విచారణలో అనేక ప్రశ్నలు గుప్పించనున్నారు. కెల్విన్ తో డబ్బు లావాదేవీలపై విచారణ చేసి ఆరాతీయనున్నారు. మరి ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి. ప్రస్తుతానికి ఈడీ నుండి 15మందికి పైగా నోటీసులు వెళ్ళినట్లు తెలుస్తుంది. మరిన్ని రోజుల పాటు ఈడీ విచారణ కొనసాగుతూనే ఉంటుంది.