Nikhil : ‘స్పై’ మూవీలో హీరో నిఖిల్ న్యూ లుక్ రిలీజ్

-

కార్తికేయ2’ సినిమాతో హీరో నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 18 పేజెస్​తో మరో హిట్ అందుకున్నాడు. డిఫరెంట్ కంటెంట్​తో కూడిన సినిమాలు ఎంచుకుంటూ తన కెరీర్ గ్రాఫ్​ను అలా పెంచేసుకుంటూ వెళ్తున్నాడు నిఖిల్. 18 పేజెస్​ తర్వాత ఈ యువ హీరో మరో సరికొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

‘స్పై’గా థ్రిల్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు నిఖిల్. ఛాయాగ్రహకుడు బీహెచ్‌.గ్యారీ తెరకెక్కిస్తున్న తొలి చిత్రమిది. కె.రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవి కానుకగా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నిఖిల్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. ఈ సందర్భంగా సినిమాలోని ఓ కొత్త లుక్‌ను పంచుకున్నాడు. అందులో ఆయన స్పైగా గన్‌ పట్టుకొని స్టైలిష్‌ లుక్‌తో కనిపించాడు. వినూత్నమైన స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో నిఖిల్‌కు జోడీగా ఐశ్వర్య మేనన్‌ నటిస్తోంది. శ్రీచరణ్‌ పాకాల స్వరాలందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news