పీఎఫ్ అనేది అన్ని ప్రైవేట్ కంపెనీలు వారి ఉద్యోగులు కల్పించే హక్కు. ఉద్యోగుల జీతాల్లోంచి కొంత మొత్తాన్ని కట్ చేసి, కొంత యాడ్ చేసి దాస్తారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఆసరాగా ఉంటుంది. అలాగే ఇందుల్లో కంటిన్యూగా పది సంవత్సరాలు సొమ్ము దాచుకుంటే రిటైరయ్యాక పింఛన్ సదుపాయాన్ని కూడా ఈపీఎఫ్ ఓ కల్పిస్తుంది. అయితే ఏళ్లుగా సొమ్మును దాస్తున్నా తమ ఖాతా లో ఎంత సొమ్ము ఉందనేది వినియోగదారులకు తెలియదు.
టెక్నాలజీ పరంగా అన్ని విషయాలు అప్ డేట్ అయినట్టుగానే పీఎఫ్ ఖాతాల్లో బ్యాలెన్స్ చెక్ చేసుకునే విషయం కూడా అప్ డేట్ అయ్యింది. ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఒక్క మిస్ డ్ కాల్ తో ఇంట్లోనుంచే బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవచ్చు.. అదెలానే ఇప్పుడు తెలుసుకుందాం..
*. ముందుగా పీఎఫ్ యాక్టివ్ గా ఉందనేది నిర్ధారించుకోవాలి.
*. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్ కు మిస్ట్ కాల్ ఇవ్వాలి.
*. మిస్ట్ కాల్ ఇచ్చిన కొద్దిసేపటికే మీరు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ గురించి పూర్తి సమాచారం తో ఎస్ఎంఎస్ ను అందుకుంటారు..
మెసేజ్ ద్వారా ఎలా తెలుసుకోవాలంటే..
*. మీ యూఏఎన్ ను మీ బ్యాంక్ ఖాతా, ఆధార్, పాన్ నెంబర్ కు లింక్ చేయాలి.
*. మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 77382 9999 కు యూఎన్ నెంబర్ టైప్ చేసి ఈపీఎఫ్ఓహెచ్ఓ అని టైప్ చేసి పంపాలి.
*. అంతే మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ సమాచారం మీ ఫోన్ కు మెసేజ్ వస్తుంది.. అంతే చాలా సులువుగా మీ బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవచ్చు..