టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు మృతి చెందారు. రెండు రోజుల కిందట టాలీవుడ్ స్టార్ నటుడు కోట శ్రీనివాసరావు కూడా మృతి చెందారు. ఇక ఈ సంఘటన మరువక ముందే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది.

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తండ్రి మృతి చెందారు. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు… ఇవాళ ఉదయం కన్నుమూశారు. 90 సంవత్సరాలు ఉన్న రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు… హైదరాబాదులోని… రవితేజ ఇంట్లోనే మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇక ఈ సంఘటన నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
- హీరో రవితేజకు పితృవియోగం
- హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు.