”ఒకే ఒక జీవితం” అంటున్న శ‌ర్వానంద్..

-

హీరో శర్వానంద్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ యేడాది మొదట్లో ‘శ్రీకారం’తో ముందుకు వచ్చిన శర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే ఈ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ మూవీలో నటిస్తున్న శర్వానంద్… ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే.. శర్వానంద్‌ హీరోగా శ్రీకార్తీక్‌ డైరెక్షన్‌లో మరో చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా పెళ్లి చూపులు ఫేం.. రీతూ వర్మ నటిస్తోంది. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి అమల గారు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా టైటిల్‌గా `ఒకే ఒక జీవితం` అని ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు ఇవాళ అఫిషీయల్‌ అనౌన్స్‌మెంట్‌ చేస్తూ… ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో శర్వానంద్‌ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. శర్వా.. భుజానికి ఓ గిటార్‌ బ్యాగ్‌ తగిలించుకుని నయా లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. శర్వా నటించిన 30వ సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ మూవీ షూటింగ్‌ కూడా ఇప్పటికే ఫినిష్‌ కాగా.. త్వరలోనే టీజర్‌ను కూడా రిలీజ్‌ చేయనుంది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version