సహనటుడిగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న వారిలో సుహాస్ ఒకడు. ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారి సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మధ్యనే విడుదలైన తన రెండవ సినిమా రైటర్ పద్మభూషణ్ కూడా హిట్ అయింది. దీనితో బ్యాక్ టు బ్యాక్ సినిమాల సక్సెస్ తర్వాత ఇప్పుడు హీరోగా రాబోతున్న మూడవ సినిమా అప్డేట్ గురించి మన అందరికీ సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు. రేపు తన సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నాడని చెప్పాడు. ఈ సినిమాకు సరికొత్త టైటిల్ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” గా ఖరారు చేశారు.