మురుగదాస్ దర్శకత్వంలో హీరో విక్రమ్ మూవీ!

-

ప్రయోగాత్మక చిత్రాలను చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చే హీరో పేరు విక్రమ్.పాత్ర కోసం ఎంత కష్ట పడటానికి అయినాపాత్ర కోసం ఎంత కష్ట పడటానికి అయినా ఆయన సిద్ధంగా ఉంటారు ” అపరిచితుడు”..”ఐ” ఇలాంటి సినిమాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.అలాంటి విక్రమ్ చేసిన” మహాన్” అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయింది.అప్పటి నుంచి ఆయన సినిమా థియేటర్లకు ఎప్పుడు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం ఆయన చేతిలో పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి.వాటిలో మే 26వ తేదీన” కోబ్రా” విడుదల కానుంది.

ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో చేసిన” పొన్నియిన్ సెల్వన్ ” లైన్ లోనే ఉంది.ఈ నేపథ్యంలో విక్రమ్ మరో సినిమాను అంగీకరించినట్లుగా తెలుస్తోంది.ఇటీవలే మురగదాస్..విక్రమ్ ను కలిసి ఒక ఇంట్రెస్టింగ్ లైన్ చెప్పారట.ఆ సినిమా చేయడానికి వెంటనే ఆయన ఒప్పుకున్నాడని అంటున్నారు.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ వారు నిర్మించనున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news