పవన్- రానా సినిమాను వదులుకున్న మరో హీరోయిన్..?

-

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా చేయడానికి ఇష్టపడుతుంది. అందునా భళ్లాల దేవ కూడా నటిస్తున్నాడంటే ఆ సినిమాకి వచ్చే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతక్రేజ్ ఉన్న సినిమాలో అవకాశం రావాలని ఎదురుచూస్తుంటారు. కానీ, ప్రస్తుతం పవన్- రానా కలిసి నటిస్తున్న సినిమాకి రివర్స్ జరుగుతుంది. మొదటగా ఎంచుకున్న సాయి పల్లవి సినిమా నుండి తప్పుకుంది. డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఏమీ చేయలేక సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

ఐతే ప్రస్తుతం మరో హీరోయిన్ కూడా తప్పుకున్నట్లు తెలుస్తుంది. రానాకి జోడీగా నటించనున్న ఐశ్వర్యా రాజేష్ కూడా తప్పుకుందని అంటున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్య క్రిష్ణమూర్తి సినిమాల ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యకి సరైన హిట్ పడలేదు. ఈ సినిమా ఆమెకి మరిన్ని అవకాశాలు తెచ్చి ఉండేదేమో! కానీ ప్రస్తుతం ఏవో కారణాల వల్ల ఐశ్వర్య కూడా తప్పుకుందని వినిపిస్తుంది. మరి వీరి స్థానాల్లో వచ్చే హీరోయిన్లు ఎవరో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news