టాలీవుడ్ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూవీ హరిహర వీరమల్లు. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లను వసూలు చేస్తోంది. జులై 23న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు పడ్డ విషయం తెలిసిందే. జులై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇందులో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించాడని ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తారు.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో నివసిస్తున్న తెలుగువారి కోసం ఆంధ్రప్రదేశ్ భవన్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీని ప్రదర్శిస్తున్నారు. నిన్న ఒక షో ను ప్రదర్శించగా.. మంచి స్పందన లభించినట్టు సమాచారం. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మరో షోను ప్రదర్శించనున్నట్టు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ తెలిపారు. సినిమాలో పవర్ స్టార్ నటన, కీరవాణి మ్యూజిక్ కి పాజిటివ్ టాక్ రాగా.. సెకండాప్ లో వచ్చే VFX పై విమర్శలు వస్తున్నాయి.