ఎక్కిళ్ళు ఆగకుండా వస్తున్నాయా..అయితే ఇలా చేయండి..!!

-

ఎక్కిళ్ళు ఆగకుండా ఎప్పుడైనా ఒకసారి వస్తే ఆలోచించాల్సిన పనిలేదు. కానీ, తరుచుగా ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటే వైద్యున్ని సంప్రదించాలి. ఎక్కిళ్ళు గ్యాస్ ప్రాబ్లెమ్ వల్ల కూడా వస్తుంటాయి. మామూలు ఎక్కిళ్ళు వస్తుంటే కొంచెం పంచదార నోట్లో వేసుకుంటే సరిపోతుంది.శరీరంలో అధికవేడితో బాధపడేవారు సబ్జా గింజలను వేడినీటిలో నానబెట్టి పాలలో కలిపి మధ్యాహ్నం పూట తాగితే ఇందులో వుండే పీచు పదార్థం కి శరీరంలోని అధిక వేడి తగ్గించే గుణం ఉంటుంది.ఇంకా వెల్లుల్లి ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మరియు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఉదయం బ్రెష్ చేసుకొనేటప్పుడు బ్రెష్ పై కొంచెం నిమ్మరసం కానీ సోడా ఉప్పు కానీ వేసుకొని బ్రెష్ చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తాయి.నోట్లో జీలకర్ర కానీ, లవంగం, ధనియాలు కానీ వేసుకొని చప్పరిస్తూ ఉంటే నోటి దుర్వాసన పోతుంది .శరీరంపై ఎక్కడైనా కాలినప్పుడు ఆ ప్రదేశంలో తేనెకానీ, మన పెరట్లో దొరికే కలబంద కానీ రాస్తే బొబ్బలు ఏర్పడకుండా చేస్తాయి. అలాగే దాని తాలూకా మచ్చలు లేకుండా చేస్తాయి.

కొందరికి ఎంత రాత్రయినా నిద్ర పట్టకుండా నిద్రలేమితో బాధపడుతువుంటారు . అలాంటి వారు ఒక కప్పు నీటిలో కానీ,పాలల్లో కానీ,రెండు స్పూన్ల తేనే కలుపుకొని పడుకోబోయే ముందు త్రాగితే మంచి నిద్ర పడుతుంది.మూత్రపిండాల సమస్య బాధపడేవారు ఆహార పదార్థాలలోపీచు ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకుంటే ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. మూత్రపిండాల సమస్య వున్నవారు అరటిపళ్ళు తినకపోవడం మంచిది.

ఎక్సిమా వంటి చర్మ వ్యాధులు కలవారు ఖర్జురా పండ్ల రసం తీసుకోవడం వల్ల తొందరగా నయం అవుతుంది.పైపుతగా వేపాకుతో రసం పూయడం, వేపాకు లేదా తులసి గుణాలున్న సబ్బులను వాడితే చర్మ వ్యాధులు తొందరగా తగ్గుతాయి.మనం తినే ఆహారంలో కారాన్ని అధికంగా వాడితే పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.కావున ఎండుకారం బదులు మిరియాలు లేదా లవంగాలను ఆహారంలో చేర్చుకోవాలి

Read more RELATED
Recommended to you

Latest news