తెలంగాణకు హైఅలర్ట్.. రానున్న 48 గంటల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

-

రాబోయే 48 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.అంతేకాకుండా రాష్ట్రంలోని హన్మకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరికలు పంపారు.

శుక్రవారం తేదీన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. దీంతో ఆయా జిల్లాల్లో అధికారులు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. వరుసగా కురుస్తున్న వర్షాలకు రైతులు, సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్, సూర్యాపేట జిల్లాల్లో భారీ ఆస్తి, పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news