హైబీపీ, డయాబెటిస్ ఉన్నవారు నిత్యం 6 గంటల కన్నా తక్కువ సమయం పాటు నిద్రిస్తే.. వారు క్యాన్సర్ లేదా హార్ట్ ఎటాక్‌లతో చాలా త్వరగా చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని పలువురు సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనలలో వెల్లడైంది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన టైముకు అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అందరికీ తెలిసిందే. దాంతోపాటు నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి. అయితే హైబీపీ, డయాబెటిస్ ఉన్నవారు నిత్యం 6 గంటల కన్నా తక్కువ సమయం పాటు నిద్రిస్తే.. వారు క్యాన్సర్ లేదా హార్ట్ ఎటాక్‌లతో చాలా త్వరగా చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని పలువురు సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనలలో వెల్లడైంది.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న పెన్ స్టేట్ హెల్త్ మిల్టన్ ఎస్.హెర్షే మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు అక్కడి స్లీప్ ల్యాబొరేటరీలో 1600 మందిని ఒక రాత్రి పాటు నిద్రపోవాలని చెప్పారు. ఆ తరువాత వారికి ఉన్న వ్యాధులను బట్టి వారి ఆరోగ్యస్థితిని పరిశోధకులు ఎప్పటికప్పుడు ట్రాక్ చేశారు. దీంతో కేవలం 3 సంవత్సరాల కాలంలోనే హైబీపీ, డయాబెటిస్ ఉన్నవారు క్యాన్సర్, హార్ట్ ఎటాక్‌లతో చనిపోయారని నిర్దారించారు. హైబీపీ ఉన్నవారు క్యాన్సర్‌తో, డయాబెటిస్ ఉన్న వారు హార్ట్ ఎటాక్‌లతో చనిపోయినట్లు తెలుసుకున్నారు.
కనుక సదరు సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. నిత్యం ఎవరైనా సరే.. కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రించాలని అంటున్నారు. ముఖ్యంగా హైబీపీ, డయాబెటిస్ ఉన్నవారు 6 గంటల కన్నా ఎక్కువ సమయం పాటు నిద్రించాలని, లేదంటే క్యాన్సర్, గుండె జబ్బులతో చాలా త్వరగా చనిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ పరిశోధన వివరాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లోనూ ప్రచురించారు..!