బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా చూసిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష !

-

మాములుగా ఎవరి ఇంట్లో వారు స్నానం చేయడం తెలిసిందే. కానీ కొన్ని సందర్భాలలో ఏవైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ , లేదా సడెన్ గా బయటకు వెళ్ళినప్పుడు బాత్ రూమ్ వాడాల్సి వస్తే అక్కడక్క ఏర్పాటు చేసిన తాత్కాలిక బాత్ రూమ్ లలో మన అవసరాలను తీర్చుకుంటూ ఉంటాము. ఇలాంటి బాత్ రూమ్ కు సంబంధించిన ఒక సమస్య మీద ఢిల్లీ త్రైలో కోర్ట్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు వైరల్ గా మారింది. బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న ఒక మహిళను చూసినందుకు గానూ ఆ వ్యక్తికి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.

ఈ శిక్ష వేసింది ట్రయిల్ కోర్ట్ కాగా.. ఈ తీర్పును ఢిల్లీ హై కోర్ట్ సమర్ధించింది. హై కోర్ట్ మహిళ అయినా, పురుషుడు అయినా బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా చూడడం తప్పు కిందకే వస్తుందని… బాత్ రూమ్ లో స్నానం చేయడం వారికీ రహస్య ప్రదేశం అని చెప్పాలి అంటూ కామెంట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news