ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజినీకి ఊహించని షాక్ తగిలింది. గ్రానైట్ తవ్వకాలకు ఎన్ఎస్ఓ జారీ అంశంపై మంత్రి రజినీకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాపరెడ్డికి కూడా ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
ఎన్టీఆర్ జిల్లా మడకపొడి లో 90 ఎకరాలు అసైన్ భూమిలో తవ్వకాలకు అనుమతించడంతో మంత్రి రజిని హస్తం ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ జరిపిన ఏపీ హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ విడదల రజినీతో పాటు స్థానిక తహసిల్దార్ కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణలో మూడు వారాల పాటు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. మరి దీనిపై విడదల రజిని ఎలా స్పందిస్తుందో చూడాలి.