ఎంపీ రఘురామకు షాక్‌.. పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

-

తెలంగాణ హైకోర్టు వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షాక్‌ ఇచ్చింది. అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ప్రధాన నిందితుడైన సీఎం జగన్ బెయిలును రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. బెయిలు రద్దుకు సరైన కారణాలు లేవని పేర్కొంది హైకోర్టు. జగన్ మోహన్‌రెడ్డి బెయిలు షరతులను ఉల్లంఘించారని చెప్పేందుకు ఒక్క ఘటనను కూడా పేర్కొనలేదని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. కాబట్టి బెయిలును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తన తీర్పులో స్పష్టం చేశారు. జగన్ ద్వారా బెదిరింపులు, ప్రలోభాలకు గురైన సాక్షుల వివరాలను వెల్లడించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Telangana High Court directs govt to ramp up RT-PCR testing

అధికార దుర్వినియోగానికి పాల్పడి సహ నిందితులకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేస్తారన్నవి సరైన కారణాలు కావని హైకోర్టు పేర్కొంది. బెయిలు రద్దు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు గతేడాది సెప్టెంబరు 15న కొట్టివేసిందని గుర్తు చేసిన న్యాయస్థానం.. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవని సీబీఐ పేర్కొందని పేర్కొన్నారు న్యాయమూర్తి. కాబట్టి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత బెయిలు రద్దు కోరుతూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తన తీర్పులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news