ఈరోజు మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు… ఎంతంటే..?

-

వరుసగా రెండు రోజులు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన తరవాత నిన్న ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచేశాయి. దీనితో వాహనదారుల పై ఎఫెక్ట్ పడుతుంది. అయితే మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇక మరి తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎంత మేర పెరిగాయో చూసేద్దాం. శుక్రవారం పెట్రోల్ ధర తెలంగాణ హైదరాబాద్‌లో 90 పైసలు పెరిగింది. దీనితో పెట్రోల్ ధర లీటరుకు రూ. 110.89కు ఎగసింది. అదే డీజిల్ అయితే 87 పైసలు పైకి చేరింది. దీంతో దీని రేటు లీటరుకు రూ. 97.22కు పెరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎంత మేర పెరిగింది అనేది చూస్తే…ఏపీ గుంటూరు అమరావతిలో కూడా పెట్రోల్ ధర పెరిగింది. పెట్రోల్ రేటు 88 పైసలు పైకి చేరింది. దీంతో లీటరు పెట్రోల్ రేటు రూ. 112.96కు ఎగసింది. అలానే డీజిల్ రేటు కూడా పైకి చేరింది. డీజిల్ ధర లీటరుకు 84 పైసలు కదలడంతో రూ. 98.94కు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి.

క్రూడ్ ధరలు మళ్లీ 119 డాలర్లకు పైగా వుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.13 శాతం పెరిగింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 119.17 డాలర్లకు చేరింది. ఇది ఇలా ఉంటే డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 0.11 శాతం క్షీణించింది. దీంతో ఈ రేటు 112.22 డాలర్లకు తగ్గింది. అయితే క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు వస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news