రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు అస్సా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. సర్జికల్ స్ట్రైయిక్స్ పై ఫ్రూప్స్ అడిగిన రాహుల్ గాంధీపై.. అస్సాం సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
అయితే.. తాజాగా మరోసారి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. గల్వాన్ ఘటనకు మూడేళ్లు గడిచిన సందర్భంగా బిశ్వ శర్మ నివాళులు అర్పించాడు. సర్జికల్ స్ట్రైక్‌ను ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు మళ్లీ మన అమరవీరులను అవమానించాయి. గాంధీ కుటుంబానికి తమ విధేయతను నిరూపించుకునే ప్రయత్నంలో, వారు సైన్యానికి ద్రోహం చేశారని.. సైన్యం పట్ల నాకు విధేయత ఉందని.. జీవితాంతం నన్ను తిట్టినా.. నేను పట్టించుకోనని బిశ్వశర్మ వ్యాఖ్యానించారు.