చుండ్రును పోగొట్టే ఇంట్లో తయారు చేసుకునే అద్భుతమైన ఔషధాలు..

-

ఏదైనా కొత్త డ్రెస్ వేసుకోవాలంటే భయపడేవారు చాలా మంది ఉన్నారు. భుజం మీద పడే చిన్న చిన్న తెల్లటి పదార్థం ఇబ్బంది పెడుతుందని వాటిని వేసుకోవడమే మానేస్తారు. అవును, మీరు చదువుతున్నది చుండ్రు గురించే. నెత్తిమీద చనిపోయిన చర్మ కణాలు పొరలాగా విడిపోయి రాలిపోయేటువంటి పదార్థమే చుండ్రు. ఇది మలాసెజియా అనే ఫంగస్ వల్ల ఏర్పడుతుంది. వాతావరణంలోని తేమ మలాసెజియాతో చర్య జరిపి చర్మాన్ని పొట్టు పొట్టులా బయటకి పంపించేస్తుంది. ఇంకా, సీబమ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కూడా ఈ పరిస్థితి వస్తుంది.

ఐతే ఈ చుండ్రుని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

నూనె వాడరాదు

స్నానం చేసిన తర్వాత జుట్టుకి నూనె రాయకుండా ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టని వాళ్ళు ఉంటారు. కానీ జుట్టుకి నూనె పెట్టకూడదు. మలాసెజియా ఫంగస్ కి నూనె ఆహారం వంటిది. దానివల్ల మరింత చుండ్రు పెరిగే అవకాశమే ఎక్కువ.

వెనిగర్

వెనిగర్ చుండ్రుని నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. స్నానం చేయడానికి అరగంట ముందు జుట్టుకి వెనిగర్ ని నీటితో కలిపి జోడిస్తే చుండ్రు నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా కూడా చుండ్రుని నివారించడంలో ఉపయోగపడుతుంది. దురదని తగ్గించి చుండ్రుని సమూలంగా నివారించదంలో బేకింగ్ సోడా పనిచేస్తుంది.

వేపాకు

వేపాకు చేసే మేలు గురించి అందరికీ తెలిసిందే. వేపాకుని నీళ్ళలో ఉడకబెట్టి జుట్టుకి పట్టించుకుని ఆ తర్వాత తలస్నానం చేస్తే చాలు. ఇలా వారానికి రెండు సార్లు చేసినా చుమ్డ్రు బారి నుండి తప్పించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news