హరీశ్ రావుకు హాప్ నాలెడ్జ్.. పెద్దాయనకు ఫుల్ నాలెడ్జ్ : సీఎం రేవంత్ రెడ్డి

-

సభను తప్పుదోవ పట్టించిప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.  ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నామన్నారు. పూర్తి సత్య దూరమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. బడ్జెట్ పై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులకు ఎక్కువ సమయం ఇచ్చామన్నారు. అసత్యాలను రికార్డుల నుంచి తొలగించాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, విద్యుత్ సంస్థలు మూడు పార్టీలు కలపి 2017లో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. మీటర్లు పెడతాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు. గృహాలకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఓప్పందంలో బీఆర్ఎస్ స్పష్టంగా పేర్కొందన్నారు. విద్యుత్ ఒప్పందాలపై హరీష్ రావు వాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. హరీష్ రావుకు ఆఫ్ నాలెడ్జ్.. పెద్దాయనకు పుల్లు నాలెడ్జ్.. ఇలాంటి వారికి మేము  ఏం చెబుతామన్నారు. గతంలో బతుకున్న చీరలు ఇస్తే.. మహిళలు తగలబెట్టిన పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో బతుకుతారన్నారు. బతుకమ్మ చీరల విషయంలో గతంలో అవినీతి జరిగిందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news