శ్రీహరి స్థానంలో జగపతి బాబు.. ఆ సినిమాకు ఎలా ఒప్పుకున్నారంటే?

-

జనరల్ గా ఒక నటుడు ఒప్పుకున్న పాత్రను అనివార్య కారణాల వలన చేయలేకపోతే ఇంకొకరు చేయడానికి ఒప్పుకోరు. కానీ, జగపతి బాబు అటువంటి సందర్భంలో ఓ పాత్ర పోషించి ఆ పాత్రకు ప్రాణం పోశారు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే టైమ్ కు నటుడు శ్రీహరి చనిపోయారు. అప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది కూడా. ఆ సందర్భంలో శ్రీహరి స్థానంలో జగపతిబాబును తీసుకురావడం ఎలా జరిగిందనే సంగతి తెలుసుకుందాం.

డైరెక్టర్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రెజీనా కసాండ్ర హీరో హీరోయిన్లుగా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ టైంలో శ్రీహరి చనిపోయారు. దాంతో ఆ పాత్రను పోషించేవారు అనగా ఆ స్థానం భర్తీ చేసేది ఎవరు? అనే చర్చ జరిగింది.

అప్పుడు జగపతి బాబు చేయగలడని దిల్ రాజు డైరెక్టర్ కు చెప్పి ఆయన వద్దకు వెళ్లాడు. జగపతి బాబుకు పాత్ర గురించి చెప్పి ఆయనను ఒప్పించాడు.

తనకు ‘ఆకాశమంత’ సినిమా సమయంలో సాయం చేసిన జగపతిబాబుకు సరిపోయే పాత్ర ఇది అని తనకు నమ్మకముందని చెప్పి జగపతి బాబును ఒప్పించినట్లు దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలా అలనాటి సంగతులను దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. ఇక ఈ పిక్చర్ సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news