పార్టీకి వెళ్ళేటపుడు మేకప్ వేసుకుని అందంగా రెడీ అవడం అందరికీ తెలుసు. కానీ మేకప్ సామాగ్రిని శుభ్రపర్చుకోవాలని ఎంతమందికి తెలుసు. అవును.. మేకప్ సామాగ్రిని శుభ్రపర్చుకోవడం చాలా ముఖ్యం. మీ చర్మం ఉండే బాక్టీరియా మేకప్ సామాగ్రిని అతుక్కుంటుంది. అలా రెగ్యులర్ గా వాడుతూ ఉండడం వల్ల అది మీ చర్మంపై ప్రభావాన్ని చూపించి, మొటిమలు, నల్లమచ్చలు వంటివి అయ్యేలా చేస్తుంది. అందుకే మేకప్ సామాగ్రిని శుభ్రపర్చుకోవడం కంపల్సరీ.
మేకప్ ప్రొఫెషనల్స్ అందరూ ఈ విషయంలో ఖచ్చితంగా ఉంటారు. అలా చేయకపోతే దానివల్ల కలిగే నష్టాలు వాళ్లకి తెలుసు. ఐతే మేకప్ కిట్స్ ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
ముందుగా బ్రషెస్..
నెలకి రెండుసార్లయినా బ్రష్ లని కడగాలి. కళ్లకింద, చెంపలమీద మేకప్ వేసుకునే బ్రష్ లకి బాక్టీరియా చాలా తొందరగా చేరుతుంది. అందువల్ల ఆ భాగాల మీద మేకప్ వేసుకునే బ్రష్ లని తరచుగా శుభ్రపరుస్తూ ఉండాలి.
మాయిశ్చరైజర్ షాంపూని తీసుకుని ఒక జగ్ లో నీళ్ళు పోసి అందులో షాంపూని కలిపి మేకప్ సామాగ్రి అంతటినీ అందులో నానబెట్టాలి. ఇలా చేసాక వాటిని చల్లని నీటిలో ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల మేకప్ సామాగ్రి చాలా తొందరగా శుభ్రం అవుతాయి.
రెండు గ్లాసుల నీటిలో వెనిగర్ కలిపి అందులో బ్రషెస్ ని ఉంచాలి. ఇది బ్రషెస్ కి ఉన్న బాక్టీరియాని చంపేస్తుంది.
బ్రషెస్ ని ఎండబెట్టాలనుకుంటే టవల్ తో గట్టిగా నీటిని పిండేసి ఉంచాలి. దానివల్ల బ్రష్ పాడవకుండా చూసుకోండి.