మీ రేషన్ కార్డు పోయిందా..? అయితే డూప్లికేట్ రేషన్ కార్డుని ఇలా పొందండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో రేషన్ కార్డు ఒకటి. రేషన్ కార్డు వలన చాలా ఉపయోగాలు వున్నాయి. రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు హోల్డర్స్ రేషన్ సరుకులను కూడా పొందలేరు. పీఎం కిసాన్ డబ్బులు పొందడానికి కూడా రేషన్ కార్డు అవసరం.

ration-cards
ration-cards

అయితే ఎప్పుడైనా ఒకవేళ మీ రేషన్ కార్డు పోతే ఏం కంగారు పడద్దు. సులభంగా ఎక్కడకి వెళ్ళక్కర్లేకుండానే డూప్లికేట్ రేషన్ కార్డు ని పొందొచ్చు. అయితే మరి డూప్లికేట్ రేషన్ కార్డు ని ఎలా పొందాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మీ రేషన్ కార్డు కనుక పోతే అప్పుడు డూప్లికేట్ రేషన్ కార్డు ని ఇలా ఈజీగా పొందొచ్చు.

మీరు కనుక మీ రేషన్ కార్డుని పోగొట్టుకున్నట్టయితే మీ రాష్ట్ర ఆహార విభాగానికి చెందిన ఫుడ్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
ఆ తరవాత మీరు వెబ్ సైట్ లోకి వెళ్ళాక.. ఒక హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
తర్వాత దానిపై డూప్లికేట్ రేషన్ కార్డు కోసం అప్లై అనే లింక్‌ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఒక ఆన్‌లైన్ ఫామ్ తెరుచుకుంటోంది.
ఆ ఫామ్‌లో మీరు ముఖ్యమైన సమాచారాన్ని ఫిల్ చెయ్యాలి.
ఫైనల్ గా మీరు డూప్లికేట్ రేషన్ కార్డు కోసం కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
సబ్‌మిట్ చేసేయండి. అంతే ఇలా డూప్లికేట్ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news