మార్కెట్ లోకి నకిలీ గుడ్లు..ఎలా గుర్తించాలంటే?

-

డబ్బులు సంపాదించాలని చాలా మంది తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు..అందులో ప్రజల ప్రాణాలకు ఏమైనా పర్వాలేదు మా జేబులు నిండితే చాలు అని భావిస్తున్నారు.దాంతో ప్రజల తాగే పాల నుంచి తినే ఆహారం వరకూ అన్నీ కల్తీ జరుగుతుంది.. ఇటీవల కోడి గుడ్లు కూడా కల్తీ అవుతున్నాయి..మాంసాహారం కాబట్టి ప్రతి ఒక్కరూ తింటున్నారు.. అందుకే కల్తీ గుడ్లను మార్కెట్ లోకి తీసుకోని వచ్చారని సమాచారం..మార్కెట్లో కృత్రిమ గుడ్లు విరివిగా దొరుకుతున్నాయి..

గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే మార్కెట్లో దొరికే కృత్రిమ, నకిలీ గుడ్లను తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే మార్కెట్ నుంచి గుడ్లు తీసుకొచ్చేటప్పుడే నకిలీ, అసలైన గుడ్ల మధ్య తేడాను గుర్తించాలని సూచిస్తున్నారు. మార్కెట్లలో దొరుకుతున్న కృత్రిమ గుడ్లతో ఎలాంటి అనర్థాలు ఉన్నాయి? వాటినెలా గుర్తించాలి? పూర్తీ విషయాలు తెలుసుకుందాం ..

కృత్రిమ గుడ్లను సింథటిక్, ప్లాస్టిక్‌తో తయారుచేస్తాను. ఇవి చూడ్డానికి నిజమైన గుడ్ల వలె కనిపిస్తాయి. అందుకే మార్కెట్‌లో కొనుగోలు చేసే ముందు కృత్రిమ గుడ్లను సరిచూసుకోవాలి. ఇందుకోసం ముందుగా ఒక గుడ్డు పగులగొట్టి చూడండి. అందులోని పచ్చసొన, తెల్లసొన బాగా కలిసిపోతే గుడ్డు నకిలీదని అర్థం. నిజమైన గుడ్డు నీటిలో మునిగిపోతుంది. కానీ సింథటిక్, ప్లాస్టిక్‌తో చేసిన గుడ్డు నీటిలో మునిగిపోదు. సాధారణంగా గుడ్లను బహిరంగ ప్రదేశాల్లో ఉంచినప్పుడు వాటిపై చీమలు, ఈగలు వంటివి వాలుతాయి. ఒకవేళ అలా జరగకపోతే అవి కృత్రిమ గుడ్లు కావచ్చు.

అలాగే నకిలీ గుడ్లను తయారు చేయడానికి దాని షెల్ మీద ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు. వాటిని మంట దగ్గర ఉంచినట్లయితే గుడ్డు నుంచి కాలిన వాసన వస్తుంది. ఒక్కోసారి మంటలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక గుడ్డు కొనేటప్పుడు దానిని గట్టిగా కదపండి. దాని నుంచి ఎటువంటి శబ్దం రాదు. నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అదే నకిలీ గుడ్డును కదిలిస్తే దాని నుంచి కొంత శబ్దం వస్తుంది..చూసి తీసుకోవడం మంచిది.. గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news