విశాఖ అభివృద్ధిపై ప్రధాని మోదీ దృష్టి సారించారని అన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై ఇప్పటికే తమ వైఖరిని స్పష్టంగా చెప్పామని.. రాజధానిగా అమరావతి కే బిజెపి కట్టుబడి ఉండని మరోసారి స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చిన సీఎం జగన్.. ఇప్పుడు ఎందుకు మూడు రాజధానులు అంటున్నారని ప్రజలే ప్రశ్నించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విపక్షాల మీద అణచివేత చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇక ఈనెల 11న సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం రానున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ తరపున ఘన స్వాగతం పలికి, అనంతరం రోడ్డు షో నిర్వహిస్తామన్నారు సోము వీర్రాజు. ఎన్ఏడి కూడాలి నుంచి పాత ఐటిఐ మార్గంలో.. లేదా బీచ్ రోడ్డులో ఏర్పాటు చేస్తామన్నారు. 12వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ ప్రధాని మోదీ పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు.