అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా మోడీ, బీజేపీని తిడుతున్నారని మండిపడ్డారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మేము ఇచ్చిన నిధుల పై ఢిల్లీ లో లేదా గోల్కొండలో చర్చించడానికి సిద్ధం అంటూ సవాల్ విసిరారు. మోడీ అసెంబ్లీలో లేనప్పుడు ఎలా ఆయన పేరు ఎలా తీస్తారు..?ఎందుకు విమర్శిస్తారు..? అని నిలదీశారు. అసెంబ్లీలో మోడీ ప్రస్తావన వచ్చినప్పుడు స్పీకర్ ఏమ్ చేస్తున్నాడని అన్నారు.
బిజెపికి ఓట్లు వేస్తే ఇల్లు కట్టించే బాధ్యత మాదేనని, అందరికీ ఉచిత విద్యని అందిస్తామని అన్నారు. ఫసల్ భీమా యోజన తెలంగాణలో అమలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. ఎంఐఎం ఎవరి కోసం పని చేయదని.. కేవలం మతం కోసం పని చేస్తోందన్నారు. నూతన సెక్రటేరియట్ ని ఒవైసీ తాజ్ మహల్ లెక్క కనిపిస్తుంది అన్నారని.. ఒవైసీ కోసం డూమ్ లు కడితే ఊరుకోమన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టి పడేలా నిర్మిస్తామన్నారు.