ఏప్రిల్ 30న ఆదివారం విమాన ప్రయాణీకుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,56,082 మంది ప్రయాణించారు. దీంతో దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. కరోనావైరస్ మహమ్మారితో దెబ్బతిన్న దేశీయ విమానరంగం మళ్లీ కోలుకుంటుందని పౌర విమానయానశాఖ మంత్రి జోతిరాధిత్య సింధియా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఏప్రిల్ 30న భారతీయ విమాన ప్రయాణాలు కొవిడ్‌కు పూర్వం సగటును అధిగమించి గరిష్ఠ స్థాయికి చేరుకుందని తెలిపారు.
మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం 4,56,082 మంది 2,978 విమానాల్లో ప్రయాణించడంతో భారతీయ విమానయాన ట్రాఫిక్ ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరుకుందని తెలిపింది. కొవిడ్‌కు ముందు దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 3,98,579గా ఉండేదని తెలిపింది. పౌర విమానయాన రంగం ప్రతిరోజూ కొత్త రికార్డులను సృష్టిస్తోందని సింధియా వెల్లడించింది.
ర్కొన్నారు.