మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ..!

-

మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సమాచారం. సోమవారం నుంచి మంగళవారం ఉదయం పలుజిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగార్డె, మెదక్‌, కామారెరడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో పాటు గంటకు 50కిలోమీటర్ల వరకు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

TS Weather | రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ..!

మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో భారీ వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది. మేరకు ఆయా జిల్లాల్లకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. అయితే, పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అనిశ్చితి కొనసాగుతుందని పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news